సహజీవనంలో ఉన్నప్పుడు గోరుముద్దలు తినిపించుకోవడం, విడిపోయిన తర్వాత తిట్టుకోవడం బాలీవుడ్ లో సర్వసాధారణం. మొన్నటికిమొన్న ఆదిత్యరాయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత అతడి ఫొటోల్ని కాల్చేసింది అనన్య పాండే. ఆదిత్య కూడా అనన్య నంబర్ ను బ్లాక్ చేసి పడేశాడు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే. మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా అర్జున్ కపూర్ బహిరంగంగా ప్రకటించాడు కూడా. తను సింగిల్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడతడు.
ఇప్పుడు మలైకా వంతు వచ్చింది. నవంబర్ టార్గెట్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది మలైకా. రోజూ వ్యాయామం చేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి, కనీసం 8 గంటలు పడుకోవాలి, మద్యం తాగకూడదు లాంటివి నవంబర్ టార్గెట్స్ గా చెప్పుకొచ్చింది.
అయితే వీటన్నింటికంటే ఆమె పెట్టుకున్న మరో టార్గెట్ హాట్ టాపిక్ గా మారింది.
విషంతో నిండిన చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలనే రూల్ పెట్టుకుంది మలైకా. దీంతో అంతా అర్జున్ కపూర్ వైపు చూస్తున్నారు. కేవలం అర్జున్ కపూర్ ను దృష్టిలో పెట్టుకొని మలైకా ఈ రూల్ పెట్టుకొని ఉండొచ్చని అంటున్నారు. మరి దీనిపై అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More