సమంత ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన వెబ్ సిరీస్ “సిటాడెల్ హానీ బన్నీ” నిరాశపరిచింది. ఈ వెబ్ సిరీస్ నాలుగు రోజుల క్రితం అమెజాన్ లో విడుదలైంది. ఈ సిరీస్ కి రివ్యూస్ నెగెటివ్ గా వచ్చాయి. అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
భారీగా ఖర్చు పెట్టి తీసిన ఈ వెబ్ సిరీస్ లో మేటర్ లేదు అని అందరూ అంటున్నారు. సమంత నటనకు పెద్దగా విమర్శలు రాలేదు కానీ మెచ్చుకోలు కూడా లేదు.
ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మొదట హాలీవుడ్ లో తీశారు “సిటాడెల్” సిరీస్ ని. 300 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి ఇండియన్ వెర్షన్ గా రూపొందించిన ఈ “సిటాడెల్ హానీ బన్నీ” కూడా తుస్సుమంది.
సమంతకి ఇది రెండో వెబ్ సిరీస్. మూడో వెబ్ సిరీస్ కూడా ఇదే దర్శకులతో చేస్తోంది. దాని పేరు… రక్త్ బ్రహ్మాండ్.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More