సెలబ్రిటీలకు ట్రోలింగ్ కామన్. హీరోయిన్లకు ఈ బాధ మరీ ఎక్కువ. అయితే ఇలాంటి ట్రోలింగ్స్ ను ఎదుర్కొనే విషయంలో ఒక్కో హీరోయిన్ ఒక్కో పద్ధతి ఫాలో అవుతుంది. చాలామంది ఫిల్టర్లు వాడుతుంటారు. మరికొంతమంది కేవలం పైపైన చూసి వదిలేస్తారు. ఇంకొంతమంది అసలు కామెంట్ సెక్షన్ జోలికి వెళ్లరు.
కానీ తమన్న మాత్రం తనుపై వచ్చిన ప్రతి కామెంట్ ను చదువుతానని అంటోంది. అందులో ఎక్కువ ట్రోల్ కంటెంట్ ఉంటుందని, అయినప్పటికీ తను వాటన్నింటినీ చదువుతానని అంగీకరించింది. మరి ఈ ట్రోల్స్ ను ఆమె ఎలా తీసుకుంటుంది?
ట్రోల్స్ అనేవి తనకు సంబంధం లేనివని అంటోంది తమన్న. ఎవరైతే ట్రోల్ చేస్తారో, ఆ వ్యక్తి మానసిక స్థితికి అది అద్దం పడుతుందని, అలాంటప్పుడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటోంది.
మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తులు, ముఖం చూపించకుండా ఏదేదో వాగుతుంటారని, వాళ్ల మైండ్ సెట్ అంతేనని తనకుతాను సర్దిచెప్పుకుంటానని అంటోంది తమన్న. ఇలా చేయడం వల్ల సదరు ట్రోల్స్ తన మనసును గాయపరచవని అంటోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More