బిగ్ బాస్ తెలుగు సీజన్-8 కంటెస్టెంట్స్ లో ఒకరు సోనియా ఆకుల. హౌజ్ లోకి వచ్చిన తర్వాతే ఈమె గురించి చాలామందికి తెలిసిందే. అలా హౌజ్ లో 4 వారాల పాటు కొనసాగి ఈమధ్యే ఎలిమినేట్ అయింది సోనియా.
హౌజ్ లో ఉన్నప్పుడే తన పెళ్లి మేటర్ బయటపెట్టింది సోనియా. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడ్నే పెళ్లాడబోతున్నట్టు వెల్లడించింది. ఇప్పుడా వివరాలు బయటకొచ్చాయి.
సోనియా పెళ్లాడబోయే వ్యక్తి పేరు యష్. ఇతడికి ఓ టూరిజం సంస్థ ఉంది. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఓ కన్సల్టెన్సీ కూడా నడిపిస్తున్నాడు. ఇతడికి చెందిన టూరిజం సంస్థలోనే సోనియా పనిచేస్తోంది.
రెండేళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తున్న సోనియాకు యష్ ఎట్రాక్ట్ అయ్యాడు. అలా ఇద్దరూ కలిశారు. హౌజ్ లోకి వెళ్లకముందే, యష్ తో కలిసి మాల్దీవులకు కూడా వెళ్లింది సోనియా. ఇప్పుడు అతడ్నే పెళ్లి చేసుకోబోతోంది.
నిజానికి ఈపాటికే వీళ్ల పెళ్లి అవ్వాల్సింది. అంతలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు హౌజ్ నుంచి బయటకు రావడంతో డిసెంబర్ లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్జీవీ తీసిన ఒకట్రెండు సినిమాలతో సోనియా పాపులర్ అయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More