శ్రద్ధ కపూర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె పేరు వల్లే, ఆమె క్రేజ్ కారణంగానే ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’ సినిమా ఏకంగా ఇండియాలో 600 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొంది. తనకు ఉన్న ఈ పాపులారిటీని ఆమె ఫుల్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె ఈ ప్రయత్నమే తెలుగు నిర్మాతలను భయపెట్టిస్తోంది.
ఆమె తెలుగులో ఇంతకుముందు “సాహో” సినిమాలో నటించింది. కానీ అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. తెలుగు సినిమాల బడ్జెట్స్ పెరిగాయి. అలాగే ఆమె పారితోషికం కూడా ఎక్కువైంది. తాజాగా ఆమెని “పుష్ప 2” సినిమాలో “కిస్సిక్” అనే ఐటెం సాంగ్ కి సంప్రదించారు. కానీ ఆమె 8 కోట్లు ఇస్తేనే చేస్తాను అని చెప్పిందట. దాంతో శ్రీలీలకు 2 కోట్లు ఇచ్చి మమ అనిపించారు. అలాగే, నానితో ‘దసరా’ దర్శకుడు తీస్తున్న కొత్త సినిమా కోసం ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. నాని చాలాకాలంగా హిందీ మార్కెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ రావట్లేదు. శ్రద్ధలాంటి టాప్ హీరోయిన్ నటిస్తే తనకు హిందీ మార్కెట్ వస్తుంది అని భావించాడు.
ALSO READ: Shraddha Kapoor’s last photoshoot of 2024
నానితో నటించేందుకు శ్రద్ధ ఒప్పుకుందట. కానీ ఆమె అడిగిన పారితోషికం అక్షరాలా 12 కోట్లు. దాంతో నిర్మాత భయపడిపోయి ఇప్పుడు కొత్త హీరోయిన్ తో సినిమా చేద్దామని భావిస్తున్నారట.
శ్రద్ధ తనకున్న క్రేజ్ కి తగ్గట్లు పారితోషికం డిమాండ్ చెయ్యడం తప్పులేదు. ఒక్క హిట్ కొట్టగానే తెలుగు హీరోలు డబులు త్రిబుల్ గా పెంచేస్తారు రెమ్యునరేషన్. మరి ఆమెకున్న పాపులారిటీని వాడుకోవాలని తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె కూడా గట్టిగానే పారితోషికం డిమాండ్ చేస్తుంది కదా..
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More