తన ఇద్దరు పిల్లల లవ్ లైఫ్ పై నాగబాబు స్పందించారు. పిల్లలు తీసుకునే నిర్ణయాల్లో తను కలుగజేసుకోనని, వాళ్లకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ప్రేమ విషయంలో, నిహారిక విడాకుల విషయంలో వ్యవహరించిన విధానాన్ని బయటపెట్టారు.
వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్టు మీడియాలో కథనాలు చూసి తెలుసుకున్నారట నాగబాబు. అయితే అవి పుకార్లు అయి ఉంటాయని అనుకున్నారట. కట్ చేస్తే, కొన్ని రోజులకు వరుణ్ వచ్చి తన లవ్ మేటర్ ను నాగబాబుకు చెప్పారట.
అన్నీ బాగా ఆలోచించుకున్నావా.. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే ఫేస్ చేయగలవా అని మాత్రమే వరుణ్ ను అడిగారంట నాగబాబు. వరుణ్ ఎస్ అని సమాధానం చెప్పడంతో వెంటనే ఓకే అన్నారట.
అటు నిహారిక విషయంలో కూడా ఇలానే వ్యవహరించానన్నారు నాగబాబు. నిహారికది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆమెకు కూడా సంబంధం నచ్చింది. కానీ పెళ్లి తర్వాత ఇద్దరికీ పొసగలేదు. దీంతో ఒకరోజు నాగబాబు దగ్గరకొచ్చి విడిపోవాలని ఉందంటూ చెప్పిందట. బాగా ఆలోచించుకున్నావా అని మాత్రమే నిహారికను అడిగానని అన్నారు.
ప్రస్తుతం నిహారిక హ్యాపీగా ఉందని, కొన్నేళ్లకు ఇంకో అబ్బాయిని చూసుకొని, పెళ్లి చేసుకుంటుందని, సంతోషంగా ఉంటుందని అన్నారు నాగబాబు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More