న్యూస్

తమన్నని వదిలి ఫాతిమాతో!

Published by

రెండేళ్ల పాటు తమన్నాతో డేటింగ్ చేశాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని భావించారు అంతా. కానీ పెళ్లి చేసుకునే విషయంలోనే విజయ్ వర్మ మీనమేషాలు లెక్కిస్తుండడంతో తమన్న బ్రేకప్ చెప్పింది.

ఐతే, తాజాగా విజయ్ వర్మ ఇటీవల బాలీవుడ్ భామ ఫాతిమా సనా షేక్ తో కలిసి చక్కర్లు వేస్తున్నాడు.

రెస్టారెంట్ల వద్ద డిన్నర్ చేస్తూ క్లబ్బులల్లో పార్టీలు చేసుకుంటూ కనిపిస్తున్నాడు. ఐతే, వీరితో పాటు ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. అయినా, వీరి మధ్య డేటింగ్ మొదలయ్యిందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహాగానాలు షురూ అయ్యాయి.

నిజానికి ఫాతిమా గతంలో పలువురు హీరోలతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అమీర్ ఖాన్ తో కూడా లింకప్ రూమర్లు వచ్చాయి. అలాగే ఇటీవల ఒక నటుడితో ఆమె వ్యహరించిన వీడియో కూడా వైరల్ అయింది. ఐతే, ఇప్పుడు మాత్రం విజయ్ వర్మతో తరుచుగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో దక్షిణాదిలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అని ఆరోపణలు చేసిన ఈ భామ ఇటీవలే మాట మార్చింది. మొత్తంగా దక్షిణాది పరిశ్రమ అలా ఉంది అనలేదు అని, ఒకట్రెండు అనుభవాలు తనకు ఎదురయ్యాయి అని మాత్రమే చెప్పాను అని వివరణ ఇచ్చింది.

మరోవైపు, విజయ్ వర్మ సినిమాల కన్నా ఇలా హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ పాపులర్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025