యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు లక్షల్లో అభిమానులున్నారు. వాళ్లలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తను కూడా చేరిపోయానంటోంది జాన్వి కపూర్. తారక్ తో కలిసి “దేవర” సినిమా చేసిన ఈ బ్యూటీ, అతడ్ని దగ్గరుండి చూసిన తర్వాత వీరాభిమానిని అయిపోయానని అంటోంది.
ముంబయిలో “దేవర-1” ట్రయిలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వి కపూర్.. సెట్స్ లో ఎన్టీఆర్ ను చూసి చాలా నేర్చుకున్నానని తెలిపింది. ఎన్టీఆర్ నిబద్ధత, వ్యక్తిత్వం చూసిన తర్వాత అతడికి ఫ్యాన్ అయిపోయానని తెలిపింది.
కుదిరితే తారక్ తో మళ్లీమళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని వెల్లడించింది జాన్వి కపూర్.
దేవర-1 ట్రయిలర్ లో జాన్వి కపూర్ పల్లెటూరి పిల్లగా కనిపించింది. ఆమె పాత్ర పేరు ‘తంగం’. సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీ మీద తీసిన “చుట్టమల్లే” పాట బాగా వైరల్ అయింది. ఈ మాస్ స్టార్ తో ఆమె హాట్ కెమిస్ట్రీ బాగుంది అని అంటున్నారు జనం.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More