ఇప్పటికే దీపిక పదుకోన్, ప్రణీత తల్లులయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ చిత్ర శుక్లా కూడా చేరింది. తను గర్భం దాల్చిన విషయాన్ని చిత్ర స్వయంగా వెల్లడించింది. తనకు జరిగిన శ్రీమంతం ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది.
చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది చిత్ర శుక్లా. 2016లో శ్రీవిష్ణు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత “రంగులరాట్నం”, “సిల్లీ ఫెలోస్”, “ఉనికి”, “తెల్లవారితే గురువారం”లాంటి సినిమాల్లో నటించింది.
అయితే కెరీర్ లో ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న వైభవ్ ను పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల్లోనే వైభవ్ తో చిత్రాకు పరిచయం ఉంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.
గతేడాది డిసెంబర్ లో వైభవ్-చిత్ర శుక్లా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడామె బిడ్డకు జన్మనివ్వబోతోంది. అన్నట్టు చిత్ర శుక్లా నటించిన ఓ 2 చిన్న సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేదు.
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More
తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More