నటి హేమ మరో వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పట్నుంచి వరుసగా వీడియోలు విడుదల చేస్తున్న ఈ నటి, తాజాగా మరో వీడియా చేశారు. ఈసారి ఆమె ఓ సెక్షన్ మీడియాపై ఆరోపణలు చేశారు.
తనకు డ్రగ్స్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా పాజిటివ్ వచ్చినట్టు కథనాలు ఇస్తున్నాయని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి తను సదరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పటికీ ఫలితం ఉండడం లేదని బాధపడ్డారు.
అందుకే ఆ మీడియా వాళ్లకు తనదైన ప్రతిపాదన చేశారు హేమ. కొంతమంది మీడియా సంస్థల ప్రతినిధులంతా కలిసి కూర్చొని చర్చించి ఓ తేదీ చెబితే, ఆ తేదీకి హేమ, వాళ్లు చెప్పిన ప్లేస్ కు వస్తుందంట.
అన్ని రకాల శాంపిల్స్ అందిస్తుందంట. అలా మీడియానే తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఏ శిక్ష అయినా అనుభవిస్తానని, నెగెటివ్ వస్తే మీడియా సంస్థలు తమ వైఖరి మార్చుకోవాలని ఆమె సవాల్ చేస్తున్నారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ను తానింకా చూడలేదని, ఛార్జ్ షీట్ లో తనకు నెగెటివ్ వచ్చినట్టు పొందుపరిచినట్టు తన లాయర్ ద్వారా తెలిసిందన్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More