అవీ ఇవీ

విడాకుల పుకార్లలో హన్సిక!

Published by

ఇటీవల సినిమా తారల పెళ్లిళ్ల కన్నా విడాకుల వార్తలు ఎక్కువ అయ్యాయి. మన దక్షిణాదిలోనే నాగ చైతన్య, సమంత, నిహారిక, ధనుష్, జీవి ప్రకాష్ కుమార్, ఏఆర్ రెహమాన్, జయం రవి వంటి వారి విడాకుల ప్రకటనలు గత రెండేళ్లలో చూశాం. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా విడాకుల పుకార్లు ఎదుర్కొంటోంది.

హీరోయిన్ హన్సిక గత కొంతకాలంగా తన భర్త గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. అలాగే, ఆమె భర్తతో పబ్లిక్ గా కనిపించి ఏడాదిపైనే అయింది. దాంతో, హన్సిక, ఆమె భర్త వేర్వేరుగా ఉంటున్నారు అనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది.

తాజాగా తమిళ మీడియా వెబ్ సైట్లు ఏకంగా ఆమె భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనుంది అనే వార్తలు ప్రచురించాయి.

ఆమె భర్త సోహెల్ కత్రియా ఈ విషయంలో స్పందించాడు. విడాకుల వార్తల్లో నిజం లేదు అన్నాడు. కానీ ఇద్దరూ కలిసే ఉంటున్నారా, విడిగా ఉంటున్నారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. హన్సిక, సోహెల్ కుటుంబాల మధ్య గొడవలు మొదలు అయ్యాయి అని టాక్.

హన్సిక, సోహెల్ మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకొంది. సోహెల్ కి ఇంతకుముందు పెళ్లి అయి విడాకులు అయ్యాయి. అతనికి హన్సిక రెండో భార్య. 32 ఏళ్ల హన్సిక తెలుగులో ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా అడుగుపెట్టింది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025