అవీ ఇవీ

ఈనెల వారానికో క్రేజీ మూవీ!

Published by

మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. దాదాపు 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తోంది ‘థగ్ లైఫ్’. అందుకే ఈ సినిమాపై అంత క్రేజ్. శింబు, త్రిష లాంటి వాళ్లు అదనపు ఆకర్షణలు.

ఇక రెండో వారంలో ‘హరిహర వీరమల్లు’ వస్తోంది. ఇది కూడా మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ. ఎందుకంటే, పవన్ కల్యాణ్ సినిమాలు ఆపేసి చాన్నాళ్లయింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఈ సినిమాతో వెండితెరపైకొస్తున్నారు. అందుకే అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. 12న సినిమా థియేటర్లలోకి వస్తోంది.

మూడో వారంలో ‘కుబేర’ వస్తోంది. దీనికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి తారాగాణం ఉన్న సినిమా. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో పాటు అదే రోజు, అంటే 20వ తేదీన ‘8 వసంతాలు’ అనే మరో సినిమా కూడా వస్తోంది.

ఇక జూన్ నెలకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు మంచు విష్ణు. అతడు నటించిన ‘కన్నప్ప’ సినిమా 27న వస్తోంది. ప్రభాస్ కీలక పాత్ర పోషించడంతో అతడి అభిమానులు కూడా ఈ సినిమాపై ఓ కన్నేశారు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 

Recent Posts

అఖిల్ పెళ్లి… బాబుకి ఆహ్వానం

తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లికి ప్రముఖలను నాగార్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్… Read More

June 3, 2025

దీపికకే మణి సపోర్ట్… కానీ…

మణిరత్నం వంటి మహాదర్శకుడు కూడా హీరోయిన్ దీపిక పదుకోన్ కే మద్దతు ప్రకటించారు. షూటింగ్ టైం తక్కువ ఉండేలా చూడమని… Read More

June 3, 2025

డిసెంబర్ స్లాట్ నిండిపోతోంది

డిసెంబర్ నెల కూడా తెలుగుసినిమాకి కీలకమైన సీజన్ గా మారింది. ఇటీవల పుష్ప 2, అఖండ వంటి సినిమాలు డిసెంబర్… Read More

June 3, 2025

మేం ఆటబొమ్మలం కాదు

నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More

June 2, 2025

ఇంత ఓవరాక్షన్ అవసరమా?

సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More

June 1, 2025

మేలో ఒక హిట్, ఒక యావరేజ్

సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More

June 1, 2025