కొన్నాళ్ల కిందట నటి, మోడల్ అషు రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు బ్రెయిన్ సర్జరీ అయిందని చెప్పుకొచ్చింది. సగం గుండు గీశారంటూ ఎమోషనల్ అయింది. అయితే అప్పట్లో ఆమె చెప్పిన విషయాల్ని ఎవ్వరూ నమ్మలేరు. ప్రచారం కోసం అషు ఇలా మాట్లాడుతోందని అనుకున్నారు.
కట్ చేస్తే, తాజాగా అషు రెడ్డి తన బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టింది. వైద్యులు తనకు ఆపరేషన్ చేస్తున్న వీడియోను విడుదల చేసింది. అంతేకాదు, తను సగం గుండుతో ఉన్న ఫొటోల్ని కూడా షేర్ చేసింది.
గతంలో జరిపిన కొన్ని వైద్య పరీక్షల్లో అషు రెడ్డికి బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని తేలింది. దీంతో ఆమె హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు.
వైద్యులు ఆమె తల నుంచి ట్యూమర్ ను సక్సెస్ ఫుల్ గా తొలిగించారు. ఇదే విషయాన్ని ఆమె గతంలో వెల్లడించింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆధారాల్ని బయటపెట్టింది. తను 6 నెలల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించలేదని, పూర్తిగా కోలుకున్న తర్వాతే బయటకొచ్చానని చెప్పుకొచ్చింది.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More