40 ఏళ్లొచ్చినా పెళ్లికి దూరంగా ఉండే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. త్రిష, అనుష్క, సదా, టబు.. ఇలా వీళ్లంతా పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చేరేందుకు తహతహలాడుతోంది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి.
34 ఏళ్ల ఐశ్వర్య లక్ష్మి, తను జీవితంలో పెళ్లి చేసుకోనని అంటోంది. తనకు 29 ఏళ్లకే జ్ఞానోదయం అయిందని, వైవాహిక జీవితంలోకి అస్సలు అడుగుపెట్టనని అంటోంది. ఈ విషయంలో తనను ఎవ్వరూ ప్రభావితం చేయలేరని కూడా చెబుతోంది.
నిజానికి పాతికేళ్ల వరకు పెళ్లిపై ఐశ్వర్య లక్ష్మికి సదభిప్రాయం ఉండేదట. ఎన్నో పెళ్లిళ్లను దగ్గరుండి చూసిందంట. ఒక దశలో మాట్రిమోనీ సైట్ లో తన ప్రొఫైల్ కూడా పెట్టిందంట. అయితే చాలామంది ఆ ప్రొఫైల్ చూసి ఫేక్ అనుకున్నారట.
ఎప్పుడైతే తన చుట్టుపక్కలున్న చాలామంది జంటల్ని చూశానో, అప్పుడిక పెళ్లిపై సదభిప్రాయం పోయిందంటోంది. పెళ్లి చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఎదుగుల ఉండదనేది ఐశ్వర్య లక్ష్మి అభిప్రాయం.
ప్రస్తుతం ఈమె సాయిదుర్గతేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమధ్య ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More