రాజ్ తరుణ్ అంతే. సడెన్ గా మాయమైపోతాడు, తన సినిమా ప్రమోషన్స్ కు సడెన్ గా ప్రత్యక్షమౌతాడు. ఈ గ్యాప్ లో అతడు ఏం చేశాడు, ఏ సినిమా షూటింగ్ లో ఉన్నాడనే విషయాలు పెద్దగా బయటకు రావు.
ఇప్పుడు మరోసారి అదే దశలో ఉన్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఈ హీరో ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు లాంటి విషయాలేవీ బయటకు రాలేదు. ఒక్కోసారి అతడు హైదరాబాద్ లోనే తన ఇంట్లోనే ఉంటాడు, కానీ బయటకు రాడు. మరికొన్ని సందర్భాల్లో ఏ గోవాకో, మలేషియాకో వెళ్లిపోతాడు.
కొన్ని నెలల కిందటి వరకు అతడి పేరు మీడియాలో మార్మోగిపోయింది. దీనికి కారణం లావణ్య ఇష్యూ. రాజ్ తరుణ్ తన పెనిమిటి అంటూ లావణ్య మీడియాకెక్కింది. ఆ రచ్చ కొన్ని నెలల పాటు సాగింది.
సడెన్ గా ఆమె మాట మార్చింది. రాజ్ తరుణ్ ను చాలా ఇబ్బంది పెట్టానని, తనను క్షమించాలని వేడుకుంది. రాజ్ తరుణ్ కనిపిస్తే అతడి కాళ్లు పట్టుకొని మన్నించమని వేడుకుంటానంటూ ఏడ్చేసింది.
ఇది జరిగిన తర్వాత రాజ్ తరుణ్ మరింత హుషారుగా బయటకొస్తాడని అంతా ఆశించారు. కానీ ఇప్పటివరకు అతడి జాడలేదు. మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యే వరకు అతడు బయటకు రాకపోవచ్చు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More