భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది ‘విశ్వంభర’ సినిమా. అయితే ఆమధ్య వచ్చిన టీజర్ మాత్రం ఆ అంచనాల్ని అమాంతం తగ్గించేసింది. గ్రాఫిక్స్ మరీ పేలవంగా ఉన్నాయనే విమర్శ మూటగట్టుకుంది. తాజాగా దీనిపై స్పందించాడు దర్శకుడు వశిష్ఠ.
టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తనను నిరాశకు గురిచేసేందని చెప్పిన వశిష్ఠ.. టీజర్ కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టాడు. టెక్నికల్ గా చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల యూట్యూబ్ లో టీజర్ అంతగా ఆకట్టుకోలేదంట. అదే టీజర్ ను థియేటర్లలో ప్రసారం చేసినప్పుడు అందరికీ నచ్చిందని చెబుతున్నాడు.
రెక్కల గుర్రం యానిమేషన్ కూడా సరిగ్గా కుదరలేదని, దాంతో పాటు మిగతా ఎలిమెంట్స్ యానిమేషన్ వర్క్ కూడా జోరుగా సాగుతోందని తెలిపాడు వశిష్ఠ. టీజర్ తో వచ్చిన నెగెటివ్ కామెంట్స్ అన్నీ ట్రయిలర్ తో కొట్టుకుపోతాయంటున్నాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 80 శాతం గ్రాఫిక్ వర్క్ పూర్తయిందంట. మిగతా గ్రాఫిక్ వర్క్ కూడా బాగుందని నిర్థారించుకున్న తర్వాతే రిలీజ్ డేట్ ఇస్తామంటున్నాడు. టీజర్ పై విమర్శలు వచ్చినప్పుడు, చిరంజీవి ఇచ్చిన సపోర్ట్ ను మరిచిపోలేనన్నాడు వశిష్ఠ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More