అవీ ఇవీ

ఇక ఫుల్ టైం చేస్తాను: జెనీలియా

Published by

పాత హీరోయిన్లు ఈమధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం లేదు. పెళ్లి చేసుకున్నామా, బాబు లేదా పాపను కన్నామా, తిరిగి సినిమాల్లోకి వచ్చేశామా అన్నట్టుంది పరిస్థితి. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది జెనీలియా.

కెరీర్ లో ఆమె పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుంది. ఎట్టకేలకు ఈ మధ్యనే ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. పనిలోపనిగా సౌత్ లో కూడా ‘జూనియర్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేసింది.

తాజాగా తన గ్యాప్ కు కారణాన్ని వెల్లడించింది జెనీలియా. ఈ గ్యాప్ లో గృహిణిగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యానని వెల్లడించింది జెనీలియా.

“పెళ్లి తర్వాత భర్తకు టైమ్ ఇవ్వాలి. ఆ తర్వాత పిల్లలకు టైమ్ కేటాయించాలి. అందుకే సినిమాలకు టైమ్ ఇవ్వలేకపోయాను. మిగతా హీరోయిన్లలా రెండూ బ్యాలెన్స్ చేయడం నాకు రాదు. ఏది చేసినా పూర్తిగా చేయాలనిపిస్తుంది. ఈ పదేళ్లలో నేను నిర్మాతగా మారాను. అంతేకాదు, వ్యాపారవేత్తను కూడా అయ్యాను. ఓ ఫుడ్ కంపెనీని సొంతంగా ప్రారంభించాను.”

ఇలా ఈ పదేళ్లలో చేసిన పనుల్ని 3 ముక్కల్లో తేల్చేసింది జెనీలియా.

పిల్లలు పెద్దవ్వడంతో, ఇకపై సినిమాలకు ఫుల్ టైమ్ కేటాయిస్తానని చెబుతోంది. ‘జూనియర్’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025