విభిన్న చిత్రాల దర్శకుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు వెట్రిమారన్. ఆయన చిత్రాలు అన్నీ అటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు ఇటు కమర్షియల్ గానూ విజయం సాధించాయి. ఆయన ఇటీవల రూపొందించిన “విడుదల’ చిత్రానికి చాలా పేరు వచ్చింది. తెలుగులో కూడా విడుదల అయి ప్రశంసలు అందుకొంది.
దానికి ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. “విడుదల 2” పేరుతో రూపొందిన ఈ రెండో భాగంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా ఈ రెండో భాగం విజయ్ సేతుపతి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది.
తాజాగా “విడుదల 2” రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” ఆ డేట్ కే రానుందని ప్రచారం జరుగుతున్నా ‘విడుదుల 2’ అదే డేట్ ని ఫిక్స్ చేసుకొంది.
ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి మరో ఆకర్షణ. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More