దగ్గుబాటి ఫ్యామిలీ అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు. రామానాయుడు తెలుగుదేశం తరఫున ఎంపీగా చేశారు. రామానాయుడు తర్వాత ఆయన కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కోసం పనిచేశారు. ఐతే, ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ తెలంగాణ వరకు కాంగ్రెస్ గూటికి చేరింది.
తెలంగాణాలో కాంగ్రెస్ తరఫున వెంకటేష్ ప్రచారం చెయ్యనున్నారు.
వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వినాయక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఇద్దరు ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయ్యారు. పెళ్ళికి ముందునుంచే ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్. ఆమె ఎక్కువగా ఫుడ్ పోస్టులు పెట్టి పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆమె ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో ఆమె తన మామయ్య తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆమె భర్త తండ్రి రామసహాయం రఘురామ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతో ఆమె విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మామయ్య తరఫున విస్తృతంగా ప్రచారం జరుపుతున్నారు.
“త్వరలో మా నాన్న కూడా ఇక్కడికి వస్తారు. మీరంతా మా మావయ్యకే ఓటెయ్యాలి,” అంటూ ఆమె కోరుతున్నారు. మరి నిజంగా ఆమె తండ్రి హీరో వెంకటేష్ ప్రచారంలోకి దిగుతారా అన్నది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More