ఇలా ఓ సినిమా ప్రకటించిన వెంటనే అలా గాసిప్స్ పుట్టుకురావడం సర్వ సాధారణం. రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా ఇలానే జరిగింది. తను పూర్తిగా మారిపోయానని, తను తీసిన ‘సత్య’ సినిమా చూసిన తర్వాత జ్ఞానోదయం అయిందంటూ చాలా చెప్పుకొచ్చాడు వర్మ.
అలా ప్రకటించిన మరుసటి రోజే కొత్త సినిమా ప్రకటించాడు. దానికి ‘సిండికేట్’ అనే టైటిల్ కూడా పెట్టాడు. చూచాయగా స్టోరీలైన్ కూడా వెల్లడించాడు. ‘జంతువుల కంటే క్రూరమైన మనుషులు’ అనే ట్యాగ్ లైన్ కూడా ప్రకటించాడు.
ఇంత జరిగిన తర్వాత గాసిప్ రాయుళ్లు ఊరుకుంటారు. వాళ్లు తమదైన శైలిలో రెచ్చిపోయారు. ‘సిండికేట్’ లో వెంకటేశ్ నటిస్తున్నాడని.. కీలక పాత్రల్లో బిగ్ బి, ఫహాద్ ఫాజిల్, పృధ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారంటూ రాసుకొచ్చాడు.
అది కాస్తా వైరల్ అవ్వడంతో, వర్మ మరోసారి రంగంలోకి దిగాడు. ఓ సెక్షన్ మీడియాలో నడుస్తున్న ప్రచారంలో నిజం లేదని, అదంతా ఫేక్ అని ప్రకటించాడు. త్వరలోనే నటీనటుల వివరాలను తానే ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. అదీ సంగతి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More