దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటివరకు మూడు చిత్రాలు చేస్తే మూడు హిట్టే. అందులోనూ “అల వైకుంఠపురంలో” ఇంకా భారీ బ్లాక్ బస్టర్. ఐతే “పుష్ప” సినిమా తరవాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడం, త్రివిక్రమ్ ఇటీవల తీసిన “గుంటూరు కారం” యావరేజ్ గానే ఆఆడిందనే కారణంతో వీరి కాంబినేషన్ లో ప్రకటించిన నాలుగో చిత్రం ఉంటుందా అన్న డౌట్స్ వచ్చాయి.
ఐతే, అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని త్రివిక్రమ్ టీం అంటోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ సినిమా పనిలోనే ఉన్నారట. సాలిడ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు సమాచారం.
మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం ఎలా ఉన్నా త్రివిక్రమ్, అల్లు అర్జున్ తరుచుగా కలుసుకుంటున్నారట. త్రివిక్రమ్ తదుపరి చిత్రం బన్నీతోనే అని వారి మాట.
త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టి అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నట్లు ప్రచారం ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ ఆగస్టులో విడుదల కానుంది. కానీ అంతకుముందే షూటింగ్ పూర్తి అవుతుంది. సో, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాలి.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More