నేహా శెట్టికి క్రేజ్ తెచ్చిన చిత్రం… డీజే టిల్లు. ఆ సినిమాలో ఆమె రాధిక అనే పాత్రలో అదరగొట్టింది. దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ లో అనుపమ నటించింది. ఈ సినిమా కూడా హిట్టే. ఇందులోనూ నేహా శెట్టి అతిథిగా మెరిసింది.
ఐతే, “డీజే టిల్లు”కి, “టిల్లు స్క్వేర్”కి మధ్యలో ఆమె నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ పరాజయం పాలు అయ్యాయి.
బెదురులంక, రూల్స్ రంజన్ అనే రెండు చిత్రాలు కూడా ఆమె ‘టిల్లు’ ఇమేజ్ పై ప్రచారం చేసుకున్నాయి. అయినా ఫలితం దక్కలేదు. వరుసగా రెండు ఫ్లాప్ లతో ఆమె రేస్ లో ఇప్పుడు వెనకబడింది. మళ్ళీ క్రేజ్ తెచ్చుకోవాలంటే నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలి.
ఈ భామ ప్రస్తుతం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” విడుదల కోసం చూస్తోంది. ఈ సినిమాలో ఆమె విశ్వక్ సేన్ సరసన నటించింది. “టిల్లు” హీరో సిద్ధూ జొన్నలగడ్డలా ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ హీరో విశ్వక్ సేన్ కూడా సినిమా మొత్తం అన్నీ తానై చూసుకుంటాడు. అలాగే ఈ సినిమాలో మొదటి పాట ఇప్పటికే పాపులర్ అయింది. ఆ పాటలో ఆమె తడి అందాలు కుర్రాళ్లకు గిచ్చుకునేలా చేశాయి.
ఐతే గ్లామర్ షో కన్నా పాత్ర బాగుంటేనే ఆమెకి క్రేజ్ వస్తుంది. రాధిక పాత్ర అలాంటిదే. మరీ ఈ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఆమెకి మరోసారి ఊపు తెస్తుందా అనేది చూడాలి.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More