దశాబ్దాల కెరీర్ చూసింది త్రిష. ఒక దశలో కెరీర్ క్లోజ్ అనుకున్న టైమ్ లో బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు మరోసారి స్టార్ స్టేటస్ అందుకుంది. ఒకప్పుడు నటించిన స్టార్ హీరోలందరితో మళ్లీ సినిమాలు చేస్తోంది.
చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, విజయ్.. ఇలా స్టార్స్ అందరితో మళ్లీ నటిస్తున్న త్రిష.. కెరీర్ ప్రారంభంలో తను మానసిక స్థితిని బయటపెట్టింది.
అందాల పోటీల్లో పాల్గొంటున్న టైమ్ లో, యాడ్స్ కూడా అప్పుడప్పుడే వస్తున్న టైమ్ లో త్రిషకు సినిమా ఛాన్స్ వచ్చిందట. అగ్రిమెంట్ లో సంతకం పెట్టే ముందు, సినిమా సరిగ్గా ఆడకపోతే తనను ఏమీ అనకూడదని, సినిమాలు వదిలేసి చదువుకుంటానని తల్లి ముందు కండిషన్ పెట్టిందంట త్రిష.
ఆ కండిషన్ కు తల్లి అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్ పై సంతకం చేసిందట. ఒకవేళ మొదటి సినిమా సరిగ్గా ఆడకపోతే ఈపాటికి సైకాలజిస్ట్ అయ్యేదాన్నని చెప్పుకొచ్చింది త్రిష.
త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం “విశ్వంభర” జులైలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమెకిది రెండో చిత్రం. ఇంతకుముందు “స్టాలిన్” చిత్రంలో నటించింది.
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More
తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More