న్యూస్

శ్రీలీల‌ను స‌త్క‌రించిన మెగాస్టార్

Published by

ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన మ‌హిళ‌ల‌కు అలాగే ఇత‌ర మ‌హిళామ‌ణుల‌కు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. తాజాగా హీరోయిన్ శ్రీలీలని కూడా సత్కరించారు.

చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభ‌ర‌’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. అదే స్టూడియోలో మరో ఫ్లోర్ లో శ్రీలీల‌కి సంబంధించిన మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పక్క ఫ్లోర్ లోనే ఉన్నార‌ని తెలుసుకున్న శ్రీలీల‌ విశ్వంభ‌ర సెట్స్‌కు వెళ్లి చిరంజీవి గారిని క‌లిశారు.

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన శ్రీలీల‌కు శాలువా క‌ప్పి ఆమె ప్రతిభని, ఆమె విజయాన్ని మెచ్చుకున్నారు. తక్కువ టైంలో మంచి పాపులారిటీ తెచుకున్నందుకు అభినందించారు. అలాగే ఆమెకి దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బ‌హుమ‌తిగా బ‌హుక‌రించారు మెగా స్టార్ చిరంజీవి.

ALSO READ: త్వరలో శ్రీలీల మరో ప్రకటన

మెగాస్టార్ నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తిని అందుకున్న‌ శ్రీలీల సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025