దర్శకుడు శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకం. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు ఉంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ …ఇలా ఎన్నో మ్యూజికల్ హిట్స్. హ్యాపీడేస్, ఫిదా వంటి చిత్రాల పాటలు కొన్నేళ్లు ఊపేశాయి. అలాంటి దర్శకుడు ఈ సారి హిట్ సాంగ్స్ పై పెద్దగా శ్రద్ద పెట్టలేదు.
ఆయన తాజాగా తీసిన చిత్రం…కుబేర. ఈ నెల 20న విడుదల కానుంది. కానీ ఇప్పటివరకు ఒక్క పాట వైరల్ కాలేదు. సినిమా విడుదల తర్వాత క్లిక్ అవ్వాల్సిందే.
కీరవాణి తర్వాత (అనామిక చిత్రం) శేఖర్ కమ్ముల ఒక పెద్ద సంగీత దర్శకుడితో పని చెయ్యడం విశేషం. ఈ సినిమాకి దేవిశ్రీ పాటలు ఇచ్చాడు. ట్రైలర్లో, టీజర్లో వచ్చిన ఒక బ్యాగ్రౌండ్ పాట బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వైరల్ పాటే లేదు.
“కుబేర” సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించారు. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు వైరల్ సాంగ్ కావాలి. ‘పుష్ప’ సక్సెస్ లో పాటలు కీలక పాత్ర పోషించాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More