ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి గుర్తుందా? ఇటీవల ముగిసిన మహా కుంభమేళాలో ఈ అమ్మాయి అందం చూసి …హీరోయిన్లకు తక్కువ కాదు అంటూ సోషల్ మీడియా పనిలేని బ్యాచ్ ఒకటి వైరల్ చేసింది. సాయి పల్లవి వంటి హీరోయిన్ల కన్నా ఈ పల్లెటూరి అందమే గొప్ప అంటూ నార్త్ ఇండియన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ తెగ ప్రచారం చేశాయి.
ఆ అమ్మాయి, ఆమె కుటుంబం కుంభమేళాలలో పూసలు, గాజులు అమ్మకునేందుకు వచ్చింది. ఈ పూసలు అమ్మనుకునే అమ్మాయి ఇంత అందమా అంటూ ఎవరో ఒకరు, సోషల్ మీడియాలో పెట్టడం, ఆ ఫోటో వైరల్ కావడం, మీడియా దానికి ప్రచారం కల్పించడం, ఒక ఊరుపేరు లేని సినిమా దర్శకుడు ఆమెకి ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించుకోవడం, మళ్ళీ ఆ మీడియా ఆ వార్తకు ప్రచారం ఇవ్వడం… ఇలా అన్ని టకాటకా జరిగిపోయాయి.
సనోజ్ మిశ్రా అనే ఆ దర్శకుడు నిజంగా ఆమెతో సినిమా తీస్తాడా లేదా అన్నది కూడా ఎవరూ ఆలోచించలేదు. ఆమె పెద్ద హీరోయిన్ అయిపోయినట్లు ప్రచారం చేశారు. ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపొయింది. కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఇదిగో ఆ దర్శకుడు ఒక రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
మరో అమ్మాయికి (మోనాలిసాకి కాదు) సినిమా అవకాశాలు పేరుతో మాయమాటలు చెప్పి ఆమెని అత్యాచారం చేశాడట. ఆ కేసులో సనోజ్ మిశ్రా బెయిల్ కావాలని, అక్రమ కేసు అని వాదిస్తూ వచ్చాడు. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ రోజు (మార్చి 31) పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
మరి మోనాలిసాతో సినిమా ఉంటుందా? ఆ అమ్మాయి హీరోయిన్ అవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More