మొన్నటివరకు ఆమె మినిస్టర్. కాబట్టి పూర్తిగా వెండితెరకు, బుల్లితెరకు దూరమయ్యారు. ఇప్పుడామె మాజీ మంత్రి. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. సో.. ఆమెకిప్పుడు ఖాళీ సమయం దొరికింది. దీంతో మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు రోజా.
రోజా అంటే జబర్దస్త్… జబర్దస్త్ అంటే రోజా. అలా ఉండేది ఆ బంధం. నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమె ఆ కార్యక్రమాన్ని వీడలేదు. ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పట్నుంచి అన్ని రకాల వినోద కార్యక్రమాలకు ఆమె దూరమయ్యారు.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడంతో మరోసారి బుల్లితెరపై కన్నేశారు రోజా. ఓ వైపు రాజకీయాల్ని కొనసాగిస్తూనే, మరోవైపు టీవీ షోల్లో కనిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జీ తెలుగులో ఓ కార్యక్రమంలో ఆమె కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది.
అయితే ఆమె తిరిగి జరర్దస్త్ సెట్స్ లోకి అడుగుపెడతారా లేదా అనేది చూడాలి. 2013 నుంచి 2022 వరకు జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు రోజా. మళ్లీ ఇప్పుడామె అందులోకి కూడా రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More