న్యూస్

జానీ కేసులో కూడా శేఖర్ భాషా

Published by

ఆర్జే శేఖర్ భాషా (RJ Shekar Basha) గుర్తున్నాడా.. ఆమధ్య రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో తగుదునమ్మా అంటూ తలదూర్చాడు. తనకుతాను రాజ్ తరుణ్ కు బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకొని, అతడికి వత్తాసుగా వరుసపెట్టి మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు.

అలా రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో శేఖర్ భాషా కూడా లాక్ అయ్యాడు. ఇప్పుడీ వ్యక్తి జానీ మాస్టర్ వివాదంలో కూడా వేలు పెట్టాడు. దీనికి సంబంధించి కూడా కేసు ఎదుర్కొంటున్నాడు.

తాజాగా జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ కేసుపై మాట్లాడ్డం మొదలుపెట్టాడు శేఖర్ భాషా. ఇక్కడితో ఆగితే ఓకే. ఏకంగా తన దగ్గరున్న ఆడియో క్లిప్స్ లీక్ చేయడం మొదలుపెట్టాడు. జానీ మాస్టర్ తో శ్రేష్టి మాట్లాడిన కాల్స్ ను శేఖర్ భాషా లీక్ చేస్తున్నాడట.

ఈ మేరకు శేఖర్ భాషాపై కేసు పెట్టింది శ్రేష్టి వర్మ. తన గౌరవాన్ని కించపరిచేలా శేఖర్ భాషా వ్యవహరిస్తున్నాడని, మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ తన పరువు తీస్తున్నాడంటూ అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అతడి మొబైల్ ను, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను తక్షణం సీజ్ చేయాలని ఆమె పోలీసుల్ని కోరింది.

శేఖర్ భాషాపై ఇది మూడో పోలీసు కేసు. గతంలో ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పడింది. ఇక రాజ్ తరుణ్ ను తన భర్తగా చెప్పుకుంటున్న లావణ్య, ఇప్పటికే శేఖర్ భాషాపై కేసు వేసింది. ఇప్పుడు శ్రేష్టి వర్మ కూడా కేసు ఫైల్ చేసింది.

మరోవైపు శేఖర్ భాషా, లావణ్యపై రివర్స్ లో కేసు వేయడానికి రెడీ అవుతున్నాడు. తనను హత్య చేసేందుకు స్నేహితులతో కలిసి లావణ్య కుట్ర పన్నుతోదంటూ, ఆమెపై ఏకంగా మర్డర్ ఎటెంప్ట్ కేసు పెడుతున్నాడు. దీనికి సంబంధించి తాజాగా ఆడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. 

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025