న్యూస్

శారీ చీర కథ కాదు: ఆర్జీవీ

Published by

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమాలు తీయడం లేదు. కొందరు యువ దర్శకులకు తన ఐడియాలు చెప్పి సినిమాలు తీయిస్తున్నారు. అలా చేసిన కొత్త చిత్రం… ‘శారీ’ (Saaree).

ఇన్ స్టాగ్రామ్ లో తన శారీ ఫోటోషూట్ లతో మొదట గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి ఆరాధ్య దేవి అందానికి ఫిదా అయిన ఆర్జీవీ శారీ కథ అల్లేశారు. ఈ సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఐతే, ఇది చీర కథ కాదు ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది అని అంటున్నారు ఆర్జీవీ. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు గిరి కృష్ణ కమల్ దీన్ని రూపొందించారు.

“సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ మీద చేసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. నేను చేసిన స్క్రిప్ట్ కంటే చాలా గొప్పగా దర్శకుడు గిరికృష్ణ కమల్ మూవీని రూపొందించాడు,” అన్నారు ఆర్జీవీ

హీరోయిన్ ఆరాధ్య దేవి తనకు అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్ చెప్పింది. :ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్,” అని తెలిపింది ఆరాధ్య.

Recent Posts

విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్

మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More

June 28, 2025

ప్రభాస్ మేనియా పని చేస్తుందా?

'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More

June 26, 2025

బికినీ ఫోటోలకు ఇది టైమా?

సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More

June 26, 2025

శుక్రవారం నుంచి ‘సదానిర’

"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్‌ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More

June 26, 2025

అంతర్జాతీయ చిత్రంలో వరలక్ష్మి!

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More

June 25, 2025

డైరక్టర్ అవ్వాలని అనుకుందట

మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More

June 25, 2025