ఇలాంటి మాటలు ఫ్యాన్స్ చెబుతుంటారు. నిర్మాతలు, దర్శకులు కూడా చెబుతుంటారు. కానీ ఓ హీరో ఇలాంటి స్టేట్ మెంట్ ఇస్తే అది చాలా పెద్దది అవుతుంది. అలాంటి పెద్ద స్టేట్ మెంట్ ను రామ్ చరణ్ ఇచ్చాడు. నేను మామూలుగా ఇలాంటివి చెప్పనని, కానీ పెద్ది సినిమాకు చెబుతున్నానని, రాసి పెట్టుకోండంటూ బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లండన్ వెళ్లిన చరణ్, అక్కడ ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడాడు. ‘పెద్ది’ అప్ డేట్స్ బయటపెట్టాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయినట్టు ప్రకటించాడు.
ఇదే సందర్భంగా మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించాడు. ‘రంగస్థలం’ సినిమా కంటే రెట్టింపు బెటర్ గా ఉంటుందంట ‘పెద్ది’. ఇలా తన సినిమా గురించి చాలా గొప్పగా చెప్పకొచ్చాడు చరణ్.
‘గేమ్ చేంజర్’ కోసం చాలా టైమ్ తీసుకున్న ఈ హీరో, ‘పెద్ది’ ని రికార్డ్ టైమ్ లో ముగించాలని నిర్ణయించాడు. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More