పవన్ కళ్యాణ్ కి చెయ్యాలనిపిస్తే వెంటవెంటనే షూటింగ్ కానిచ్చేస్తారు. చెయ్యాలనిపించకపోతే ఎదో ఒక వంక చెప్పి నెలల కొద్దీ షూటింగ్ లకు రాకుండా డుమ్మా కొడుతారు. నిర్మాతల డబ్బు అంతా వేస్ట్ చేస్తారు. ఆయన సినిమా షూటింగ్ లు అన్నీ ఆయన చిత్తం ప్రకారం జరుగుతాయి. నిర్మాతల, దర్శకుల ప్లానింగ్ ని ఆయన పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి నిర్మాతలు ఇంకా మారు మాట్లాడ్డానికి లేదు. ఆయన ఏ రోజు సెట్ కి వస్తే ఆ రోజు మహాప్రసాదం అన్నట్లుగా షూటింగ్ చేసుకోవాలి.
తాజాగా ఆయనకి షూటింగ్ లు పూర్తి చెయ్యాలని భావన కలిగింది. అందుకే మొన్న రెండు రోజుల్లో “హరి హర వీర మల్లు” షూటింగ్ పూర్తి చేశారు.
ఇక ఇప్పుడు “ఓజి”కి టైం, డేట్స్ ఇచ్చారు. “ఈ సారి షూటింగ్ ముగిద్దాం,” అని నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ స్టయిల్ లో ట్వీట్ వేసింది. మొత్తానికి ఈ షూటింగ్ ని పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది టీం.
వచ్చే నెల “హరి హర వీర మల్లు”, సెప్టెంబర్ లో “ఓజి” విడుదల అనేది తాజా ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే ఐదారు నెలల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు విడుదల అవుతాయి.
2023లో విడుదలైన “బ్రో” తర్వాత మరో సినిమా రాలేదు పవన్ కళ్యాణ్ నుంచి. ఇప్పుడు ఏకంగా ఒకే ఏడాది రెండు సినిమాలు విడుదయ్యేలా ఉన్నాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More