రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చరణ్, ఆయన భార్య, కూతురు వెళ్లారు. చరణ్ తల్లితండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా హాజరయ్యారు.
ఆవిష్కరణ అనంతరం రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటోలు తీసుకొంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ మైనం విగ్రహం ప్రత్యేకత ఏంటంటే… ఆయనతో పాటు ఆయన పెంపుడు కుక్కని కూడా అక్కడ ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో క్వీన్ ఎలిజిబెత్ తర్వాత పెంపుడు కుక్కతో మైనం విగ్రహం పొందిన ఏకైక సెలెబ్రిటీగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు.
రామ్ చరణ్ భార్య చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె ఎక్కువ ఫోటోలు దిగడం విశేషం. “నిజమైన భర్త కన్న ఈ వాక్స్ భర్త బాగున్నాడు,” అంటూ ఉపాసన జోక్ చేసింది. ఆ ఫోటోలను, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసన షేర్ చేసింది.
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More
తన సినిమాలో చిరంజీవి పాత్రపై స్పందించాడు అనీల్ రావిపూడి. కామెడీ టైమింగ్ లో చిరంజీవి నెక్ట్స్ లెవెల్ అని తెలిపిన… Read More
పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. 'హరిహర వీరమల్లు' సినిమా కోసం నిధి… Read More