లావణ్య ఇష్యూతో బాగా డిస్టర్బ్ అయ్యాడు హీరో రాజ్ తరుణ్. కెరీర్ లో తొలిసారి భారీ వివాదాన్ని ఫేస్ చేస్తున్న ఈ హీరో, తన తాజా చిత్రం ప్రమోషన్ కు కూడా దూరమయ్యాడు. ఎక్కడ మీడియాకు ఎదురుపడితే, ఏ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ ఆందోళన చెందాడు
అలా రాజ్ తరుణ్ ప్రచారం లేకుండానే గత వారం థియేటర్లలోకి వచ్చింది “పురుషోత్తముడు” అనే సినిమా. ఆ సినిమాని ఎక్కడా ప్రచారం చెయ్యలేదు రాజ్ తరుణ్.
ఇప్పుడు “తిరగబడరా సామీ” ఆగస్టు 2న విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ ని తగులుకొని తనకు దూరం చేసింది అని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేసింది. సో ఈ సినిమా కూడా ప్రచారం లేకుండానే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రచారం ప్రారంభించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఎక్కడా లావణ్య ఇష్యూ తెరపైకి రాకుండా, యాంకర్లు ఆ ప్రశ్నలు అడక్కుండా ఉండాలనే కండిషన్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు.మొత్తానికి వివాదాన్ని టచ్ చేయకుండానే నాలుగు గోడల మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా ప్రచారం కానిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పట్లో అతడు నేరుగా మీడియా ముందుకు రాకపోవచ్చు.
“తిరగబడరా సామీ” అనే ఈ సినిమాకి ఎలాంటి హైప్ ఐతే లేదు. మరి ఈ వివాదం ఏమైనా కలిసొస్తుందా అనేది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More