సరిగ్గా నెల రోజుల కిందట తను గర్భం దాల్చిన విషయాన్ని బయటపెట్టింది లావణ్య కొణెదల త్రిపాఠి. అంతే, ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇన్ని రోజులకు లావణ్య బయటకొచ్చింది. కెమెరా కంట పడింది.
భర్త వరుణ్ తేజ్ తో కలిసి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది లావణ్య. అలా తొలిసారి ఆమె బేబీ బంప్ తో కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్లు ఇప్పుడు తమ గర్భాన్ని దాచుకోవడం లేదు. ఎఁచక్కా బేబీ బంప్ తో ఫొటోషూట్స్ కూడా చేస్తున్నారు. వాటిని అందమైన జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. పనిలోపనిగా తమ అభిమానులతో కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే లావణ్య ఇంకా అక్కడివరకు రాలేదు.
ప్రస్తుతం లావణ్య చేతిలో ‘సతీ లీలావతి’ ప్రాజెక్టు ఉంది. షూటింగ్ తో పాటు, దాని డబ్బింగ్ కూడా పూర్తిచేసింది లావణ్య. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి తన కెరీర్ ను ఆమె కొనసాగిస్తుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More