సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఆ సినిమా వస్తుందని అంతా ఎదురుచూశారు. అంతలోనే ఆ ప్రాజెక్టుపై ఎలాంటి కదలిక కనిపించలేదు. ఒక దశలో సినిమా ఆగిపోయినట్టు ప్రచారం కూడా జరిగింది.
ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై స్పందించాడు నాని. డైరక్టర్ సుజీత్ తో కచ్చితంగా సినిమా చేస్తానని, ఇప్పటికే కథ ఓకే అయిందని వెల్లడించాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే, సుజీత్ మూవీ ఉంటుందని కూడా ప్రకటించాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని, సుజీత్ సినిమా కూడా యాక్షన్ మూవీనే అని, కాకపోతే సరికొత్త పాయింట్ తో ఉంటుందని, అందులో యాక్షన్ బ్యాక్ డ్రాప్ వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నాడు. ప్రస్తుతం నాని ‘హిట్-3’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. మే 1న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది
ఈ సందర్భంగా మరో సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ‘హిట్-3’ సినిమాను ఇంత త్వరగా చేస్తానని నాని అనుకోలేదంట. ఓ సినిమా ఆగిపోవడంతో, శైలేష్ ను సంప్రదించడం, అతడు సిద్ధంగా ఉండడంతో వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయన్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More