ఏ సినిమాకైనా అవార్డ్ వస్తే ఆ సినిమా యూనిట్ మొత్తానికి ఆనందం. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తే హీరోకు రెట్టింపు ఆనందం. మరి ఒకే సినిమాకు 3 బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అదే ఆనందాన్ని పీక్స్ లో ఎంజాయ్ చేస్తున్నాడు హీరో నాని.
నాని నటించిన దసరా సినిమా అవార్డుల పంట పండిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సైమా అవార్డులు చాలా వచ్చాయి. ఈమధ్య ఫిలింఫేర్ అవార్డులు కూడా వరించాయి. ఇప్పుడు తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కూడా దసరా మెరిసింది.
ఈ 3 అవార్డుల్లో కామన్ పాయింట్ ఏంటంటే.. బెస్ట్ యాక్టర్ అవార్డు. దసరా సినిమాలో నటనకు గాను నానీకి సైమా, ఐఫా, ఫిలింఫేర్ అవార్డులు మూడూ వచ్చాయి. అలా అవార్డుల్లో అరుదైన రికార్డ్ సృష్టించాడు ఈ హీరో.
దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతడు డైరక్ట్ చేసిన తొలి సినిమానే సెన్సేషనల్ హిట్టయింది. ఇప్పుడీ దర్శకుడు, తన రెండో చిత్రాన్ని కూడా నానీతోనే చేస్తున్నాడు. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయబోతున్నాడు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More