ఈసారైనా చిరంజీవి వస్తారని అంతా ఆశపడ్డారు. అల్లు అర్జున్ ను తీసుకొచ్చి పుష్ప-2కు మరింత బజ్ తెస్తారని అనుకున్నారు. కనీసం ప్రభాస్ నైనా రిపీట్ చేస్తారని భావించారు. కానీ ‘ఆహా’ నిర్వహకులు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబును రిపీట్ చేశారు.
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్ సీజన్-4” (Unstoppable 4) మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు ప్రత్యేక అతిథిగా కనిపించబోతున్నారు. అలా అని ఇదేదో ఫ్రెష్ కాంబినేషన్ కాదు. సీజన్-2లోనే చంద్రబాబును తీసుకొచ్చారు. స్పెషల్ ఎట్రాక్షన్ గా లోకేష్ ను కూడా కూర్చోబెట్టారు.
ఇప్పుడు మరోసారి చంద్రబాబును రిపీట్ చేశారు. అన్ స్టాపబుల్ కు గెస్టుల కొరత ఉందనే టాక్ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబును పిలిచి ఆ టాక్ ను నిజం చేశారు ‘ఆహా’ మేకర్స్.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. అన్ స్టాపబుల్ కు రాజకీయ నాయకుల్ని పిలిచిన ప్రతిసారి వ్యూస్ తగ్గాయి. బజ్ కూడా తగ్గింది. ఈ విషయం తెలిసి కూడా మరోసారి చంద్రబాబును కూర్చోబెట్టడం వెనక ఆంతర్యం ఏంటో మేకర్స్ కే తెలియాలి. October 25న బాలకృష్ణ-చంద్రబాబు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More