నాగార్జున ఓ దొంగ. పైగా ఇంటి దొంగ. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. చిన్నప్పుడు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పర్సు నుంచి ఆయన డబ్బులు దొంగిలించేవారు. ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు నాగార్జున.
అయితే తన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కు అంత అవకాశం ఇవ్వలేదంటారాయన. దీనికి కూడా ఆయన కారణం వెల్లడించారు. నాగార్జున దగ్గర అస్సలు పర్సు ఉండదంట. ఒకవేళ ఉన్నా అందులో డబ్బులు ఉండవట. కాబట్టి చైతూ, అఖిల్ కు తమ తండ్రి నుంచి డబ్బులు కొట్టేసే అవకాశం కలగలేదన్నమాట.
జీవితంలో డబ్బులు సంపాదించాలంటే ఆశ ఉండకూడదన్నారు నాగార్జున. అతిగా ఆశ పడితే డబ్బులు సంపాదించలేమన్నారు. పైగా రోజంతా మొబైల్ స్క్రీన్ చూస్తే కాలం గడిపితే డబ్బు అస్సలు సంపాదించలేమనేది నాగార్జున అభిప్రాయం.
‘కుబేర’ సినిమాలో కీలక పాత్ర పోషించారు నాగార్డున. ఇన్నాళ్లూ తనను స్టార్ గా చూశారని, ఇకపై తనను ఓ నటుడిగా చూస్తారని చెబుతున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More