శుక్రవారం రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ సినిమా చూసి కొంతమంది నిరాశ చెందారు. దీనికి కారణం సూపర్ హిట్టయిన ‘నానా హైరానా’ అనే సాంగ్ లేకపోవడమే. మొదటి ఆట పడిన వెంటనే, ఈ ఇష్యూపై అధికారిక ప్రకటన చేసింది యూనిట్.
ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో తీసిన ఈ సాంగ్ సకాలంలో రెడీ అవ్వలేదని, ఇన్ ఫ్రారెడ్ ఇమేజెస్ ను ప్రాసెస్ చేయడానికి టైమ్ తీసుకుందని వెల్లడించింది. అంతేకాదు, సంక్రాంతి కానుకగా 14వ తేదీన ఈ సాంగ్ ను యాడ్ చేస్తామని కూడా తెలిపింది.
అయితే చెప్పిన తేదీకి 2 రోజుల ముందే ‘నానా హైరానా’ సాంగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యూనిట్. సిల్వర్ స్క్రీన్ పై ఈ సాంగ్ ఓ దృశ్యకావ్యంలా కనిపిస్తోంది. అద్భుతమైన ఫ్రేమ్స్, లొకేషన్స్, కలర్స్.. ఈ సాంగ్ ప్రత్యేకత.
తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను శ్రేయా ఘోషల్, కార్తీక్ ఆలపించారు. 60 మిలియన్ కు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చిన ఈ పాట, ‘గేమ్ ఛేంజర్’కు మరో అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More