చాలా గ్యాప్ తర్వాత “హరిహర వీరమల్లు” సినిమా సెట్స్ పైకి వచ్చింది.ఈ రోజు హైద్రాబాద్లో చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ విషయాన్ని నటుడు కబీర్ సింగ్ (Kabir Duhan Singh) ప్రకటించాడు. షూటింగ్ లొకేషన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 28న హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించారు.
ఐతే ఈ సినిమా డేట్ మారింది అని, ఇది ఇంకా లేట్ గా విడుదల కానుందని అని గత నెలలో మాట వినిపించింది. ఆ ప్రచారం మొదలు కాగానే “మ్యాడ్ స్క్వేర్” అనే చిన్న చిత్రం మార్చి 29గా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా విడుదల తేదీని మార్చి 28 నుంచి వాయిదా వేశారు.
ఐతే, నిజంగా “హరి హర వీర మల్లు” మార్చి 28న విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి.
ఈ సినిమాకన్నా ఒక రోజు ముందు మోహన్ లాల్ చిత్రం “ఎల్ 2” పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతోంది. సో, “హరి హర వీర మల్లు” కూడా పాన్ ఇండియా లెవల్లో మోహన్ లాల్ చిత్రంతో పోటీ పడాల్సి ఉంటుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More