న్యూస్

సంపాదన అంతంతమాత్రం!

Published by

దశాబ్దాల కెరీర్. లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్లు. సౌత్ లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరో. ఇప్పటికీ పారితోషికంలో టాప్-5లో కొనసాగుతున్నారు చిరంజీవి. ఇలాంటి హీరో నుంచి ఊహించని మాటలొచ్చాయి.

అవును.. తన సంపాదన అంతంతమాత్రం అన్నారు చిరంజీవి. ఆయన ఈ మాట అనడం వెనక చాలా పెద్ద లాజిక్ ఉంది. గతంలో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు విదేశాల నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చి నాటారు చిరంజీవి.

అప్పట్లో వాటి ధరలు వేలల్లో ఉండేవని, ఆ తర్వాత లక్షల్లోకి మారాయని, ఇప్పుడు కొన్ని విదేశీ మొక్కలు కొనాలంటే కోటి రూపాయల వరకు పెట్టాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుతం తన సంపాదన అంతంతమాత్రంగానే ఉందని, అంత మొత్తం పెట్టి మొక్కలు కొనలేనంటూ జోక్ చేశారు చిరంజీవి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లో ఓ ఎకో టూరిజం పార్క్ ను ప్రారంభించారు చిరంజీవి. ఈ సందర్భంగా ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ ఎకో టూరిజం పార్క్ లో తొలిసారి షూటింగ్ జరుపుకునే అవకాశం చిరంజీవికే ఇస్తామని, ఆ తర్వాతే ఇతర సినిమాలకు అవకాశం ఇస్తామని పార్క్ ఓనర్స్ ప్రకటించడం విశేషం. 

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025