చిన్న సినిమాకు పెద్ద ప్రశంస దక్కింది. ‘క’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాను రీసెంట్ గా చూశారు చిరు. సినిమా బాగా నచ్చింది.
వెంటనే హీరో, దర్శకులు, నిర్మాతను తన ఇంటికి ఆహ్వానించారు. సినిమాను మెచ్చుకుంటూ వాళ్లను ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా గంట సేపు వాళ్లతో మాట్లాడి సినిమా విశేషాల్ని పంచుకున్నారు. అభినందించడంతో పాటు మంచి ఆతిథ్యం కూడా అందించారు.
చిన్న సినిమాకు ఎప్పుడూ చిరంజీవి మద్దతు ఉంటుంది. మెగాస్టార్ మద్దతుతో థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ తను ప్రచారం చేయకపోయినా, రిలీజైన తర్వాత ఏదైనా చిన్న సినిమా సక్సెస్ అయితే, వాళ్లను అభినందించడం చిరంజీవికి అలవాటు.
ఈసారి కూడా చిరు అదే పని చేశారు. కిరణ్ అబ్బవరం అండ్ కో ను అభినందించారు. మెగా ప్రశంసతో యూనిట్ ఉబ్బితబ్బిబ్బయింది.
అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు.… Read More
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తీస్తోన్న భారీ చిత్రం "అఖండ 2: తాండవం" ఇంతకుముందే విడుదల తేదీ ప్రకటించింది.… Read More
సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఇటీవల… Read More
శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన "గేమ్ చేంజర్" ఈ ఏడాది సంక్రాంతికి… Read More
దీపిక పదుకోను అడిగిన పారితోషికం, ఆమె పెట్టిన డిమాండ్లు అర్థంపర్థం లేనివి. అందులో అనుమానం లేదు. ఐతే పారితోషికం విషయంలో… Read More
తెలుగు నుంచి అనేక చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినవి ఉన్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2,… Read More