కొన్ని సినిమాలు సెట్స్ పై ఉంటుంటగానే ఆ మూవీ రిజల్ట్ యూనిట్ కు తెలిసిపోతుంది. మరికొన్ని సినిమాలు ఫస్ట్ కాపీ చూసినప్పుడే తెలిసిపోతుంది. గోపీచంద్ ఇలాంటివి బాగా పసిగడుతుంటాడు, ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ కూడా చేరాడు. ‘గాండీవధారి అర్జున’ సినిమా గురించి మాట్లాడాడు.
“నేను ఎంచుకున్న కొన్ని కథలు జనాలకు కనెక్ట్ అవ్వట్లేదు. స్క్రిప్ట్ లో కూడా తప్పులున్నాయి. రిలీజ్ కు ముందే సినిమాపై ఎక్సయింట్ మెంట్ పోయింది. ‘గాండీవధారి అర్జున’ టైమ్ లో కరోనా. ఇంట్లో కూర్చొని ఓటీటీలు చూడ్డం వల్ల ఆ సినిమాల ప్రభావం బాగా పడింది. అలా ‘గాండీవధారి అర్జున’ ఓకే చేశాను. రెడీ అయిన తర్వాత చూస్తే సినిమా మొత్తం ఒకటే ఉంది, ఎవ్వరికీ కనెక్ట్ అయ్యేలా లేదు అనిపించింది. రిలీజ్ కు ముందే నాకు ఆ సినిమాపై ఓ ఐడియా వచ్చేసింది.”
‘గని’ హిట్టయితే ‘గాండీవధారి అర్జున’కు కనీసం ఓపెనింగ్స్ ఉండేవని.. కానీ ‘గని’ థియేటర్లలోకి రాకముందే ‘గాండీవధారి అర్జున’ షూట్ మొదలవ్వడంతో తను ఏం చేయలేకపోయానంటున్నాడు.
‘మట్కా’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు వరుణ్ తేజ్. ఇందులో హీరోకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయి, అతడిలో మార్పు వచ్చి, మంచోడిగా మారినట్టు చూపించలేదని, అతడి పాత్రను యథాతథంగా ప్రజెంట్ చేశామని చెబుతున్నాడు. 14న వస్తోంది ‘మట్కా’.
అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు.… Read More
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తీస్తోన్న భారీ చిత్రం "అఖండ 2: తాండవం" ఇంతకుముందే విడుదల తేదీ ప్రకటించింది.… Read More
సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఇటీవల… Read More
శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన "గేమ్ చేంజర్" ఈ ఏడాది సంక్రాంతికి… Read More
దీపిక పదుకోను అడిగిన పారితోషికం, ఆమె పెట్టిన డిమాండ్లు అర్థంపర్థం లేనివి. అందులో అనుమానం లేదు. ఐతే పారితోషికం విషయంలో… Read More
తెలుగు నుంచి అనేక చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినవి ఉన్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2,… Read More