సినిమా చిన్నదా పెద్దగా అని చూడడం లేదు ఆడియన్స్. బాగుందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. బాగుంటే చిన్న సినిమాకైనా వంద కోట్లు కట్టబెడుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మహారాజ కూడా చేరే అవకాశం ఉంది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.ఇదే ఊపు ఇంకా ఉంటే సినిమా వంద కోట్ల మార్క్ కు చేరుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఐతే, ఈ గురువారం ప్రభాస్ హీరోగా రూపొందిన “కల్కి 2898 AD” సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా వచ్చిన తర్వాత “మహారాజ” సినిమాకు కలెక్షన్లు పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
నితిలన్ స్వామినాధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించి. తెలుగులో మోస్తరుగా ఆడింది. ఐతే, “కల్కి” వల్ల ఈ సినిమాకి దెబ్బ పడేలా ఉంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More