సాయి పల్లవి గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు. పూర్తిగా రెస్ట్ తీసుకొంది. కానీ ఈ ఏడాది (2024)లో మాత్రం ఆమె రెస్ట్ దొరకడం లేదు. అంతగా బిజీ అయింది.
2022లో “విరాట పర్వం” విడుదల తర్వాత బ్రేక్ తీసుకొంది. గతేడాది చివర్లో కొత్త సినిమాలు సైన్ చెయ్యడం మొదలు పెట్టింది. ప్రస్తుతం మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందుకే ఆమె ఊపిరి సలపనంత బిజీగా ఉంది.
తెలుగులో ఆమె నాగ చైతన్య సరసన “తండేల్” అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విశాఖ పట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా చాలా భాగం మిగిలే ఉంది. డిసెంబర్ లో విడుదలయ్యే “తండేల్” కోసం ఆమె కష్టపడుతోంది.
ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ రెండో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇప్పుడు రణబీర్ కపూర్ సరసన “రామాయణ”లో సీతగా నటిస్తోంది. ఈ రెండు హిందీ సినిమాలు కూడా వచ్చే ఈఏడాది విడుదల అవుతాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More