విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. అతను స్టార్ కాదు కానీ మంచి నటుడు అని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. ఐతే, ఇప్పుడు ఆ భావన మారిపోవాలి. విజయ్ సేతుపతి సూపర్ యాక్టరే కాదు స్టార్ కూడా అని చెప్పాలి. ఎందుకంటే అతను హీరోగా నటించిన ఒక చిత్రం వంద కోట్లు కలెక్ట్ చేసింది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన “మహారాజ” తాజాగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. నితిలన్ స్వామినాధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ తో పాటు, తెలుగులో కూడా పెద్ద హిట్టయింది. తమిళంలో ఇంకా ఆడుతోంది.
తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరింది.
“కల్కి 2898 AD” కారణంగా తెలుగులో ఈ సినిమాని జనం మరచిపోయారు. కానీ తమిళనాట ఇంకా ఆదరణ పొందుతోంది. అలా విజయ్ సేతుపతి కూడా వంద కోట్ల సినిమాల హీరో అయ్యాడు. ఇక ఇప్పుడు హీరోగా అతనితో పలు సినిమాలు ప్రకటించారు తమిళ నిర్మాతలు.
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More
తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More