“రాజమౌళి మహాభారతం” ప్రస్తావన ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు దశాబ్దానికి పైగా ఈ చర్చ నలుగుతూనే ఉంది. రాజమౌళి కెరీర్ కు గమ్యస్థానం మహాభారతం అనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడీ ప్రాజెక్టుపై ఒకేసారి ఇద్దరు స్టేట్ మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ముందుగా రాజమౌళి దగ్గరకు వద్దాం. “మహాభారతం” ప్రాజెక్టుపై జక్కన్న స్పందించాడు. ఈ సినిమా గురించి ప్రస్తుతం తను ఆలోచించడం లేదని, ఎప్పుడు ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొచ్చినా అందులో నాని కచ్చితంగా ఉంటాడని వెల్లడించాడు.
అటు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా “మహాభారతం”పై స్పందించారు. గతంలో ఓ సందర్భంలో అమీర్ ఖాన్, “మహాభారతం” ప్రాజెక్టు గురించి తనతో చర్చించారని, ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదన్నారు. రాజమౌళి అంతిమ లక్ష్యం “మహాభారతం” అని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
మరోవైపు “మహాభారతం” ప్రాజెక్టుకు సంబంధించి తెరవెనక పనులు సాగుతున్నాయని కూడా అంటున్నారు. 3 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి, రాజమౌళి టీమ్ లో కొంతమంది డ్రాఫ్టింగ్ పని మీద ఉన్నట్టు సమాచారం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More