న్యూస్

జాన్ అబ్రహంతో మధుసూదన్ కోట

Published by

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో పనిచేస్తున్నారు మన తెలుగు సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ కోట. ప్రస్తుతం “అన్‌నోన్ టు నోన్” అనే డాక్యుమెంటరీ చిత్రీకరణ జరుగుతోంది. సంజీవ్ కుమార్ రాజ్‌పుత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ డాక్యుమెంటరీని M.S స్టూడియోస్ నిర్మిస్తోంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల జీవితాలపై దృష్టి పడేలా చేసే స్ఫూర్తిదాయకమైన చిత్రంగా రూపొందిస్తున్నారు.

నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB)కి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా జాన్ అబ్రహం ఉన్నారు. కేవలం ఆ హోదాలోనే కాకుండా ఈ అంశంలో జాన్ అబ్రహం వ్యక్తిగత నిబద్ధత కూడా చూపిస్తున్నారు. అన్‌నోన్ టు నోన్ అనేది కేవలం ఒక డాక్యుమెంటరీ కంటే ఎక్కువ. ఇది ఈ అంశంలో అవగాహన పెంచడం, అర్థవంతమైన మార్పును నడిపించడం లక్ష్యంగా పెట్టుకున్న శక్తివంతమైన సామాజిక అస్త్రం.

అడ్డంకులను అధిగమించి విజయవంతమైన జీవితాలను నిర్మించిన దృష్టి లోపం ఉన్న వ్యక్తుల నిజ జీవిత కథలను అన్వేషిస్తుంది ఈ చిత్రం. వారి కథనాల ద్వారా, ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ప్రేరేపించాలని ఆశిస్తుంది.

కెమెరా వెనుక తన అనుభవాన్ని పంచుకుంటూ మధుసూదన్ కోట ఇలా అన్నారు:

“ఈ ప్రాజెక్ట్ కోసం జాన్ అబ్రహంను నా కెమెరా ద్వారా బంధించిడం ఒక అద్భుతమైన అనుభూతి. అతని సహజ భావోద్వేగ మనస్తతం ప్రతి ఫ్రేమ్‌కు ఒక ప్రత్యేకమైన ప్రామాణికతను తెస్తోంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల బలం, వారి స్ఫూర్తిని దృశ్యమానంగా తెలియజేయడం సవాలు. జాన్ దీనికి తోడుగా ఉండడం వల్ల మరింత బలం వచ్చింది.”

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025