తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ అనే దర్శకుడు ఉన్నాడు. అతన్ని చాలా గొప్ప దర్శకుడు అని తమిళ ఫిలిం లవర్స్ అంటూ ఉంటారు. మన తెలుగులో మాత్రం అతనికి పెద్దగా క్రేజ్ లేదు… ఇతర తమిళ అగ్ర దర్శకులతో పోల్చితే. ఈ యువ దర్శకుడు ఇటీవల తాను కథ అందించిన తెలుగు చిత్రంతో (గేమ్ చేంజర్), తాను డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం (రెట్రో)తో అపజయాలు మూటగట్టుకున్నాడు.
ఐతే, సినిమాలు ఫ్లాప్ ఇచ్చినందుకు కాదు ఫ్లాప్ సినిమాలకు మంచి ‘రివ్యూలు’ ఇస్తూ అడ్డంగా బుక్ అవుతుంటాడు. తమిళంలో పెద్ద దర్శకులు తీసే ఫ్లాప్ సినిమాలకు కార్తీక్ సుబ్బరాజ్ ఆద్భుతంగా తీశారు కంగ్రాట్స్ అంటూ ట్వీట్లు వేస్తూ ఉంటాడు. దాంతో కార్తీక్ సుబ్బరాజు ఇప్పుడు తెగ ట్రోలింగ్ అవుతున్నాడు.
శంకర్ తీసిన “ఇండియన్ 2” ఎంత ఘోర పరాజయం అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాని ఒక్క క్రిటిక్ కూడా మెచ్చుకోలేదు. ఒక్క ప్రేక్షకుడు కూడా అభినందించలేదు. కమల్ హాసన్ స్వయంగా ఈ రెండో పార్టు కన్నా మూడో పార్టు బాగుంటుంది అని రిలీజ్ కి ముందే ప్రకటించారు. అలాంటి అట్టర్ ఫ్లాప్, బ్యాడ్ మూవీని పొగిడాడు కార్తీక్ సుబ్బరాజు.
“ఇండియన్ 2లో శంకర్ తీసిన కొన్ని సీన్లు అద్భుతం,” అన్నాడు ఈ యువ దర్శకుడు. అలాగే తానే కథ అందించిన “గేమ్ చేంజర్” సినిమాకి కూడా విడుదలైన వెంటనే పొగుడుతూ ట్వీట్లు వేశాడు. హిట్ తీశారు అంటూ కంగ్రాట్స్ కూడా చెప్పాడు శంకర్ కి. మరి రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎంత నష్టం తెచ్చిందో, ఎంత ఘోరంగా ట్రోలింగ్ ఎదుర్కుందో చెప్పక్కర్లేదు.
ఇక ఇప్పుడు “థగ్ లైఫ్.” మణిరత్నం వైబ్ సినిమాలో కనిపించింది అంటూ పొగిడేస్తూ పోస్ట్ పెట్టాడు. అంతే, జనం అతన్ని ఒక ఆటాడుకుంటున్నారు.
“నీకు హిట్ సినిమా తీసే టాలెంట్ లేదు. ఫ్లాప్ సినిమాని గుర్తించే శక్తి లేదు. ఇండస్ట్రీ పెద్దలను కాకా పట్టేందుకు ఇలాంటి ట్వీట్లు వేస్తూ కాలం గడుపుతున్నావు అంటూ,” తమిళ సోషల్ మీడియా జనం తిట్టి పోస్తున్నారు.
కార్తీక్ సుబ్బరాజు “పిజ్జా” అనే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అది హిట్. ఆ తర్వాత “జిగర్తాండ” (తెలుగులో “గద్ధలకొండ గణేష్” అనే పేరుతో రీమేక్ అయింది) హిట్. ఈ రెండు సినిమాలు తప్ప మిగతావేవి పెద్దగా ఆడలేదు. రజినీకాంత్ తో “పెట్టా “, లారెన్స్ తో “జిగర్ తండా డబుల్ ఎక్స్”, ధనుష్ తో “జగమే తంత్రం”, సూర్యతో “రెట్రో” తీసిన కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పుడు ఇలా ట్రోలింగ్ కి గురవవుతున్నాడు.
ఈ రోజు శిల్పాశెట్టి 50వ పుట్టిన రోజు. కానీ ఆమెని చూస్తే 40కి దగ్గర్లో ఉన్నట్లు కనిపిస్తుంది. స్లిమ్ గా… Read More
మృణాల్ ఠాకూర్ కి తెలుగులో ఉన్న క్రేజ్ వేరు. ఆమెని బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా గుర్తించరు. కానీ… Read More
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మాఫియా చిత్రం …. ఓజి షూటింగ్ చివరి దశకు చేరుకొంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన… Read More
దీపిక పదుకోన్ ఇటీవలే ఓ బిడ్డకు తల్లి అయింది. మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ కోసం సినిమాలు ఒప్పుకోవడం ప్రారంభించింది. ఆ… Read More
సమంతకి టాట్టులు అంటే పిచ్చి. ఒకప్పుడు బాడీపై ఎక్కడ పడితే అక్కడ పొడిపించుకొంది. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు, ఆ తర్వాత… Read More
హీరో అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు ఉదయ శ్రీనివాసు. ఎవరీ ఉదయ శ్రీనివాసు అనే డౌట్ వస్తుందా?… Read More