న్యూస్

దీపిక తన సత్తా ఏంటో చూపించింది

Published by

దీపిక పదుకోన్ ఇటీవలే ఓ బిడ్డకు తల్లి అయింది. మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ కోసం సినిమాలు ఒప్పుకోవడం ప్రారంభించింది. ఆ క్రమంలో ఆమె ప్రభాస్ సరసన “స్పిరిట్” సినిమా అంగీకరించింది. కానీ భారీగా పారితోషికం, రోజుకు ఆరు, ఏడు గంటల పని చేస్తాను అని అడగడంతో ఆ దర్శకుడు సందీప్ వంగకి కోపం వచ్చింది. దాంతో ఆమెని తొలగించి త్రిప్తిని తీసుకున్నాడు హీరోగా.

దీపిక ఇలాంటి డిమాండ్లు పెట్టింది అని సందీప్ సమాచారం లీక్ చెయ్యడం, ఆ సినిమాలో హాట్ హాట్ సీన్లు ఉన్నాయి అని దీపిక టీం మీడియాకి లీకులు ఇవ్వడంతో పెద్ద వివాదమే రేగింది. సందీప్ ఏకంగా దీపికని టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టాడు.

సోషల్ మీడియా జనాలు దీపికకి మద్దతుగా, సందీప్ కి మద్దతుగా రెండుగా చీలిపోయారు.

ఐతే, తన పారితోషికం, డిమాండ్లు ఏవీ తగ్గించుకోను, నాకు ఆ స్టార్డం ఉంది అని దీపిక మొండిగా ఉండిపోయింది. మరి ఇలాంటి డిమాండ్లతో ఆమెకి కొత్తగా అవకాశాలు రావు అని కూడా కామెంట్స్ వినిపించాయి. కానీ తన సత్తా ఏంటో చూపించింది దీపిక. భారీ పారితోషికంతో, తన డిమాండ్లతోనే మరో భారీ తెలుగు సినిమా ఒప్పుకొంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్. ఈ విషయాన్ని ఈ రోజు టీం అధికారకంగా ప్రకటించింది. దీపిక ప్రస్తుతం ఉన్న లుక్ ని కూడా ఒక వీడియో రూపంలో విడుదల చేసింది.

ALSO READ: It’s official: Deepika Padukone joins the cast of AA22xA6

ఈ ప్రకటన తర్వాత దీపికకి సపోర్ట్ పెరిగింది. తాను సూపర్ స్టార్ అని దీపిక ప్రూవ్ చేసుకుంది అని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రభాస్ కి ఏ మాత్రం తగ్గని హీరో. అల్లు అర్జున్ కి కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ మార్కెట్ ఉంది. “పుష్ప 2″తో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది.

ఇక అట్లీ తీసే ఈ సినిమా కూడా “స్పిరిట్”కి మించిన బడ్జెట్ తో రూపొందనుంది. అంటే, దీపికదే పై చెయ్యి అయింది. ఒక బడా తెలుగు హీరో సినిమా నుంచి ఆమెని తొలగిస్తే మరో బడా తెలుగు హీరో సినిమాలో ఆమె అధికారికంగా, దర్జాగా చేరింది. అదీ దీపిక స్టార్డం.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025